: తిరుగులేని ఇండియన్ పంచ్


గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో భారత బాక్సర్లు సత్తా చాటుతున్నారు. స్టార్ బాక్సర్, ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ తన పంచ్ కు తిరుగులేదని చాటుతున్నాడు. 75 కేజీల విభాగంలో ప్రీక్వార్టర్ ఫైనల్స్ లో నమీబియాకు చెందిన ముజంజా కసుటోపై 3-0 (30-27, 30-27, 30-27) తిరుగులేని విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అలాగే, 49 కేజీల విభాగంలో భారత్ కే చెందిన దేవేంద్రో సింగ్ శ్రీలంకకు చెందిన మదుషాన్ గామేజ్ ను ఓడించి క్వార్టర్స్ కు అర్హత సాధించాడు. 81 కేజీల విభాగంలో మరో భారత బాక్సర్ సాంగ్వాన్ టాంజానియాకు చెందిన మహమ్మద్ హకిముపై గెలిచి క్వార్టర్స్ లో అడుగుపెట్టాడు.

  • Loading...

More Telugu News