: బ్యాంక్ లో చోరీకి వచ్చి పట్టుబడ్డ దొంగలు


దొడ్డిదారిన వెళ్లి నెమ్మదిగా పనిచేసుకుని పోదామనుకున్న ఆ దొంగల పప్పులు ఉడకలేదు. అనుకున్న పని పూర్తి కాకుండానే వారు పట్టుబడిపోయారు. ఈ ఘటన సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత రంగారెడ్డి జిల్లా పెదవేములలో చోటుచేసుకుంది. పెదవేములలోని విజయ బ్యాంకును దోచుకునేందుకు చోరులు పక్కాగా పథకం వేశారు. బ్యాంకు వెనుక వైపు నుంచి లోపలికి ప్రవేశించేందుకు ఏకంగా గోడకు కన్నమే వేశారు. గోడకు వేసిన కన్నం ద్వారా లోపలికి వెళ్లిన దొంగలు తమ పని ప్రారంభించేలోగానే వారి ముందు పోలీసులు ప్రత్యక్షమయ్యారు. దొంగలు గోడకేసిన కన్నం ద్వారా లోపలికి ప్రవేశించగానే అలారం మోగింది. దీంతో పోలీసులు వెనువెంటనే స్పందించడంతో దొంగలు పట్టుబడిపోయారు.

  • Loading...

More Telugu News