: మంటల్లో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు


ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగిన ఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. బస్సు లోపల చేలరేగిన మంటలు క్షణాల్లోనే బస్సును పూర్తిగా దహించివేశాయి. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారు. మంగళవారం తెల్లవారుజామున సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన పుష్పక్ బస్సు అరాంఘర్ వద్ద మంటలకు కాలి బూడిదైంది. అరాంఘర్ వద్దకు చేరుకోగానే బస్సు ఇంజిన్ వెనుక భాగం నుంచి పొగలు రావడం ప్రారంభమైంది. ఈ విషయాన్ని గుర్తించిన డ్రైవర్ వెనువెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేసి, ప్రయాణికులను కిందకు దించేశాడు. ప్రయాణికులు కిందికి దిగిన కొద్దిసేపటికే బస్సులో మంటలు చెలరేగాయి. అందరూ చూస్తుండగానే మంటలు బస్సును దహించివేశాయి. ప్రమాదం జరిగే ముందు బస్సులో నలుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఈ ఘటనలో సంస్థకు రూ. 16 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు.

  • Loading...

More Telugu News