: అసెంబ్లీ స్థానాలను 153కు పెంచండి: ఈసీకి కేసీఆర్ లేఖ
తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. ప్రస్తుతమున్న 119 స్థానాలను 153కు పెంచుకోవడానికి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం అనుమతిస్తోన్న సంగతిని గుర్తుచేశారు. ఈ మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టాలని కోరారు. 2011 జనాభా లెక్కల ప్రకారం కొత్త నియోజకవర్గాలను వెంటనే ఏర్పాటు చేయాలని విన్నవించారు. అలాగే... స్థానిక నియోజకవర్గాల ఆధారంగా... ప్రస్తుతమున్న 11 ఎమ్మెల్సీ స్థానాలను 14కు పెంచుకునేందుకు రాష్ట్ర పురనర్వ్యవస్థీకరణ చట్టం అనుమతిస్తోందని... దీంతో, వీటి సంఖ్యను కూడా పెంచాలని ఈసీని కోరారు.