: కామన్వెల్త్ క్రీడల్లో సత్తా చాటుతున్న భారత్


కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ఆదివారం నాటికి పతకాల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న భారత్ ను తాజాగా సోమవారం పోటీలు ముగిసే సమయానికి నాలుగో స్థానంలో నిలబెట్టారు. నిన్నటిదాకా వెయిట్ లిఫ్టర్లు పతకాల సాధనలో కుస్తీ పడగా, తాజాగా సోమవారం షూటర్లు, భారత్ కు పతకాలను సాధించిపెట్టారు. ప్రస్తుతం భారత్, 8 పసిడి పతకాలతో పాటు 11 రజతాలు, 8 కాంస్య పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. సోమవారం నాటి పోటీల్లో భాగంగా భారత షూటర్లు ఏకంగా మూడు పతకాలను చేజిక్కించుకున్నారు. షూటింగ్ 50 మీటర్ల పిస్టల్ విభాగంలో జీతూరాయ్ పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇదే విభాగంలో గురుపాల్ సింగ్ రజతాన్ని సాధించాడు. 50 మీటర్ల ప్రోన్ రైఫిల్ విభాగంలో హైదరాబాద్ కు చెందిన గగన్ నారంగ్ రజతం సాధించాడు. మరోవైపు సోమవారం నాటి పోటీలు ముగిసే సరికి భారత్ కు చెందిన ముగ్గురు క్వార్టర్స్ కు చేరి, పతకాల వేటలో అడుగు దూరంలో నిలిచారు. మంగళవారం నాటి పోటీలు ముగిసే సరికి భారత్ మూడో స్థానానికి ఎగబాకే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News