: మాసాయిపేట ఘటనలో మరో బాలిక మృతి


మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన వైష్ణవి (11) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. దీంతో ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 18కి చేరినట్లైంది. కాపలా లైని రైల్వే క్రాసింగ్ వద్ద చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ప్రమాదం జరిగిన రోజే 14 మంది చిన్నారులతో పాటు ఇద్దరు బస్సు సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన విద్యార్థులకు హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చికిత్స పొందుతూ సోమవారం మరో విద్యార్థి తరుణ్ (9) మరణించాడు. తాజాగా చికిత్స పొందుతున్న క్రమంలోనే వైష్ణవి మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసింది. వరుసగా ఇద్దరు విద్యార్థులు చనిపోవడంతో ఆస్పత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో మరో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు సమాచారం. వైష్ణవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం యశోదా ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News