: తెలంగాణ రాష్ట్ర ల్యాండ్ మేనేజ్ మెంట్ అథారిటీ ఏర్పాటు
నూతన పారిశ్రామిక విధానంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ (సోమవారం) సమీక్ష జరిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమయ్యే భూమి కోసం... అందుబాటులో ఉన్న భూమిని సేకరించి టీఎస్ఐఐసీకి అప్పగించాలని ఆయన ఆదేశించారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ల్యాండ్ మేనేజ్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. ఆగస్టు 1 నాటికి భూముల జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించారు. ముందుగా నోటీసులు జారీ చేసిన భూమిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాదు జిల్లాలో 210 ఎకరాలు వెనక్కి తీసుకోనున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లాలోనూ దాదాపు వెయ్యి ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంటున్నట్లు సమాచారం.