: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన టీఎస్ సీఎం కేసీఆర్


రాష్ట్రంలోని ముస్లింలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్ పర్వదినం) శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోనూ వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. రంజాన్ మాసంలో జరిగే ఇఫ్తార్ విందులతో మతసామరస్యం వెల్లివిరుస్తుందని, ఇలాంటి శుభ సందర్భాల్లో అన్ని వర్గాలు పరస్పరం స్నేహ భావంతో ఉండాలని కేసీఆర్ సూచించారు. అలాగే, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News