: ప్రతి యేటా పొత్తిళ్లలోనే ప్రాణాలు కోల్పోతున్న 80 వేల మంది శిశువులు


ఉమ్మడి రాష్ట్రంలోని (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) శిశుమరణాలపై యూనిసెఫ్ అందించిన నివేదికను పరిశీలిస్తే ఆశ్చర్యమే కాదు.. భయం కూడా కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏటా 80 వేల శిశుమరణాలు సంభవిస్తున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. వైద్యనిపుణుల కొరత కారణంగా శిశుమరణాలు పెరిగిపోతున్నాయని నివేదిక పేర్కొంది. వైద్యనిపుణుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏటా పసికందులు బలవుతూనే ఉన్నారు. పొత్తిళ్లలోని పాపాయిలు ప్రాణాలు కోల్పోవడంతో తల్లులకు గర్భశోకం తప్పడం లేదు. ముక్కుపచ్చలారని చిన్నారులు సకాలంలో సరైన వైద్యం అందకపోవడంతో... పుట్టిన కొద్దిరోజులకే వారికి నిండు నూరేళ్లు నిండుతున్నాయి. కొన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లే ఉండటం లేదు. వైద్యుల ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో శిశుమరణాలకు అడ్డుకట్ట వేయడం కష్టమవుతోంది.

  • Loading...

More Telugu News