: ఢిల్లీ బీజీ మార్కెట్లో... పార్కింగ్ కారులో శవం కలకలం!
ఢిల్లీలోని బీజీ మార్కెట్ లో పార్కింగ్ చేసిన కారులో ఓ శవం ప్రత్యక్షమై కలకలం రేపింది. దక్షిణ ఢిల్లీలోని రోహిణి మార్కెట్ లోని సెక్టార్ 17లోని బీజీ మార్కెట్ సెంటరులో పార్కింగ్ చేసిన కారులో 30 ఏళ్ల వ్యక్తి శవాన్ని కుళ్లిపోతున్న దశలో పోలీసులు కనుగొన్నారు. కారులోని పత్రాల ఆధారంగా అతను ప్రహ్లాద్ సింగ్ కుమారుడిగా అనుమానిస్తున్నారు. జూలై 25న ప్రహ్లాద్ సింగ్ తన కుమారుడు కనిపించడం లేదంటూ కంజావాలా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. శవాన్ని గుర్తుపట్టేందుకు ప్రహ్లాద్ సింగ్ ను పిలిపించారు. కాగా హత్యానేరంగా కేసు నమోదు చేసిన పోలీసులు, హతుడు ఎవరు? ఎలా మృతి చెందాడు? హత్యా? ఎవరు హత్య చేసి ఉంటారు? తదితర విషయాలపై దర్యాప్తు ప్రారంభించారు.