: చంద్రబాబుతో ఎంపీ కొత్తపల్లి గీత భేటీ!
అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఇవాళ సాయంత్రం హైదరాబాదులోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన గీత ఆయనతో మాట్లాడారు. దీనితో ఆమె తెలుగుదేశం పార్టీలో చేరుతుందనే వాదనకు బలం చేకూరింది. ఇక, నేడో రేపో ఆమె ‘సైకిల్’ ఎక్కడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.