: ఆ డబ్బులు పాసింజర్లకు ఇచ్చేయండి: స్పైస్ జెట్ కు ఆదేశం


తక్షణం ఆ డబ్బులు పాసింజర్లకు వాపస్ ఇవ్వాలని ఏవియేషన్ రెగ్యులారిటీ స్పైస్ జెట్ సంస్థకు ఆదేశాలు జారీచేసింది. జూన్ 16 ముంబై నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన స్పైస్ జెట్ ఎస్ జి 419 విమానానికి సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం ఐదు గంటలు ఆలస్యంగా నడిచింది. ఆలస్యంగా నడవడంతో విమానంలో ఢిల్లీ చేరాల్సిన 172 మంది ప్రయాణికులు ఆకలితో నకనకలాడారు. దీంతో వారికి స్పైస్ జెట్ భోజన సదుపాయం చేసి దానికి చార్జీలు వసూలు చేసింది. ఇది ఏవియేషన్ రూల్స్ కి వ్యతిరేకం. నిబంధనల ప్రకారం విమానం ఆలస్యమైతే అందుకు బాధ్యత విమానయాన సంస్థదే, కనుక విమానయాన సంస్థే ప్రయాణికులకు భోజన, వసతి సౌకర్యం సమకూర్చాలి. దీనికి వ్యతిరేకంగా స్పైస్ జెట్ వ్యవహరించడంతో ప్రయాణికులు భోజనం కోసం ఖర్చుచేసిన ప్రతి పైసా వారికి తిరిగి ఇచ్చివేయాలని సంస్థను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశించింది. దీనిపై స్పైస్ జెట్ తొందర్లోనే స్పందిస్తుందని ప్రతినిధులు తెలిపారు. కాగా తక్కువ రుసుముతో ప్రయాణం ఏర్పాటు చేసినందున భోజన సదుపాయం సమకూర్చాల్సిన బాధ్యత స్పైస్ జెట్ కు లేదని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొనడం విశేషం.

  • Loading...

More Telugu News