: తెలంగాణలో ఎయిమ్స్ తరహా ఆసుపత్రికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలో ఎయిమ్స్ తరహా ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సూపర్ స్పెషాలిటీ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర మంత్రి హర్షవర్థన్ లేఖ రాశారు. ఆసుపత్రిని నిర్మించేందుకు ఒకే చోట 200 ఎకరాల స్థలం అవసరమవుతుందని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని లేఖలో కేంద్రమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం కేంద్ర బృందం స్థలం ఎంపిక చేస్తుందని లేఖలో వివరించారు. ఈ లేఖపై స్పందించిన సీఎం కేసీఆర్ ఆసుపత్రికి అవసరమైన స్థలాన్ని ఎంపిక చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.