: చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పిన రైతులు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అన్నదాతలు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల రుణమాఫీలను చేస్తున్నందుకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన రైతులు ఇవాళ చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ... ఎన్నికల ముందు, తర్వాత కూడా రైతు రుణమాఫీ చేయడం అసాధ్యమని జగన్ విమర్శలు చేశారన్నారు. రైతు వ్యతిరేకి జగన్ అంటూ రైతులు సీఎం క్యాంపు ఆఫీసు బయట నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News