: విమానం బీచ్ లో దిగి తండ్రీకూతుళ్లను ఢీకొట్టింది


రోజురోజుకి విమాన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అమెరికాలో తేలికపాటి విమానం ఫ్లోరిడా బీచ్ లో అత్యవసరంగా దిగింది. అది దిగిన సమయంలో బీచ్ లో సరదాగా గడుపుతున్న తండ్రీకూతుళ్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒమ్మి ఇరిజరి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన కుమార్తె తీవ్రంగా గాయపడింది. ఆమెను హుటాహుటిన అసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, విమానంలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. వారు సురక్షితంగా ఉన్నారు.

  • Loading...

More Telugu News