: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి: హైకోర్టు
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపన్ పాల్ పై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదు చేయాలంటూ కలకత్తా హైకోర్టు ఆదేశించింది. 72 గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ తపన్ పాల్ సీపీఎం మహిళల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఎఫ్ ఐఆర్ నమోదు చేయాలంటూ ఆదేశించింది.