: పట్టాలపై పరుగులు పెడుతోన్న జీవ వైవిధ్య ప్రత్యేక రైలు
జీవ వైవిధ్య ప్రత్యేక రైలు పట్టాలపై పరుగులు పెడుతోంది. ఈ సైన్స్ ఎక్స్ ప్రెస్ దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో 1700 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కేంద్ర మంత్రులు సదానంద గౌడ, ప్రకాశ్ జవదేకర్, జితేందర్ సింగ్ లు ఇవాళ (సోమవారం) ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలులో జీవ వైవిధ్యానికి సంబంధించిన అంశాలతో కూడిన ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ఇవాళ్టి నుంచి ఈ రైలు 197 రోజుల పాటు ప్రయాణించి.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన గుజరాత్ లోని గాంధీనగర్ చేరుకోవడంతో ఈ యాత్ర ముగుస్తుందని కేంద్ర మంత్రులు పేర్కొన్నారు. ఈ రైలు 20 రాష్ట్రాల్లోని 50 ప్రదేశాల్లో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు.