: రవితేజ 'పవర్'కు అడవి అంటుకుంది!
రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'పవర్' సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించినట్టు సమాచారం. థాయ్ లాడ్ లోని పట్టాయ సమీపంలోని ఓ అడవిలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా, అందులో ఉపయోగించిన పేలుడు పదార్థాలతో అడవిలో మంటలు చెలరేగాయి. అయితే, ఈ ప్రమాదం నుంచి అందరూ సురక్షితంగా బయటపడ్డట్టు సమాచారం. ఈ సినిమాలో రవితేజకు జోడీగా హన్సిక, రెజీనా నటిస్తుండగా, కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. 'పవర్'కు సంగీతం తమన్.