: మమ్మల్ని తెలంగాణలో పనిచేయనివ్వండి సారూ!
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో పనిచేస్తున్న నాలుగో తరగతి ఉద్యోగులు... తమను తెలంగాణ సచివాలయంలోకి మార్చాలంటూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా ఇవాళ వారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి... తమను తెలంగాణ సచివాలయంలోకి తీసుకోవాలని కోరారు. తెలంగాణ ఇంక్రిమెంట్ వర్తింపుపై ఆందోళనగా ఉందని వారు పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ... తమను తెలంగాణ సచివాలయానికి మార్చాలంటూ చేసిన విజ్ఞప్తిపై సీఎస్ సానుకూలంగా స్పందించారని చెప్పారు.