: చట్టసభల్లో క్రైస్తవులకు ప్రాతినిధ్యం కల్పిస్తాం: కేసీఆర్


క్రైస్తవులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. వచ్చే ఏడాది ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాన్ని క్రైస్తవులకు కేటాయిస్తామని ఆయన చెప్పారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చినట్లే... క్రిస్ మస్ కు ప్రభుత్వం తరపున ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఇక ప్రార్థనాలయాల (చర్చి) నిర్మాణానికి కలెక్టర్ల అనుమతి లేకుండా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని, మూడు శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నామని కేసీఆర్ వివరించారు.

  • Loading...

More Telugu News