: ఖమ్మం జిల్లాలో కుండపోత


ఖమ్మం జిల్లా చింతూరులో 15 సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గడచిన 24 గంటల్లో భారీ వర్షపాతం రికార్డు అయింది. ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటలో 13 సెం.మీ, బూర్గంపాడు, కుక్కునూరులో 12, పరకాలలో 10 సెం.మీ. వర్షం కురిసింది. కూనవరం, వేలేరుపాడులో 9, సత్తుపల్లిలో 8, భూపాలపల్లి, ములకలపల్లి, చంద్రుగొండలో 6 సెం.మీ, మధిర, కొత్తగూడెం, బోనకల్, ఇల్లెందు, పాల్వంచ, ఏటూరు నాగారం, దుమ్ముగూడెం, మణుగూరులో 5 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.

  • Loading...

More Telugu News