: ఫేస్ బుక్ ఆ టెక్కీ కొంపముంచింది... పలు మార్లు అత్యాచారం చేసిన ఎఫ్ బీ ఫ్రెండ్


ఫేస్ బుక్ ఓ టెక్కీ కొంపముంచింది. సరదాగా ప్రారంభించిన ఛాటింగ్ ఆమెను తీవ్ర ఇక్కట్లలోకి నెట్టింది. వివరాల్లోకెళితే... గుజరాత్ లోని భావనగర్ ప్రాంతానికి చెందిన రిషభ్ కతోడియా (25) ఇండోర్ లో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఫేస్ బుక్ లో ఇండోర్ ప్రాంతానికి చెందిన మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (23)ను పరిచయం చేసుకుని ఛాటింగ్ చేసేవాడు. పరిచయం కాస్త పెరిగాక జనవరి 4న ఇండోర్ వచ్చి సైట్ సీయింగ్ కి తీసుకెళ్లాడు. తరువాత కాఫీ తాగేందుకు హోటల్ గదికి ఆహ్వానించి అక్కడ కాఫీలో మత్తుమందు కలిపి మొబైల్ ఫోన్ లో అసభ్యంగా వీడియో తీశాడు. రెండు నెలల తరువాత ఫోన్ చేసి వడోదరలో గతంలో తామున్న ప్రాంతానికి రావాలని, లేని పక్షంలో తాను తీసిన వీడియో ఇంటర్నెట్ లో పెడతానని భయపెట్టాడు. దీంతో అతను సూచించిన ప్రాంతానికి వెళ్లిన ఆమెను మూడు రోజులపాటు పలుమార్లు అత్యాచారం చేశాడు. తరువాత కొంత కాలానికి ఆమె అసభ్య ఫోటోలు ఆమెకే పంపి తనను పెళ్లి చేసుకోవాలని... లేని పక్షంలో ఆ ఫోటోలను ఆమె తల్లిదండ్రులకు పంపుతానని బ్లాక్ మెయిలింగ్ కు దిగాడు. తన మాట కాదంటే చంపుతానని బెదిరించసాగాడు. ఆ కీచకుడి బాధ భరించలేని యువతి పోలీసులను ఆశ్రయించి జరిగినదంతా పూసగుచ్చినట్టు వివరించింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై అత్యాచారం, మోసం, కుట్రపూరితంగా మహిళ పట్ల వ్యవహరించడం, ఐటీ యాక్ట్ వంటి సెక్షన్లపై కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News