: లంచ్ బాక్స్ చోరీ చేసినందుకు... నాలుగేళ్ల జైలు శిక్ష!


ఓ ఉద్యోగికి చెందిన లంచ్ బాక్సును బ్యాగుతో పాటు దొంగతనం చేసిన పాపానికి... ఇద్దరు నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. ఢిల్లీలో అడిషనల్ సెషన్స్ జడ్జి హెమానీ మల్హోత్రా... భవానీ శంకర్, వికాస్ పహాడీ అనే ఇద్దరు దొంగలకు నాలుగేళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పు చెప్పారు. తన బ్యాగును దొంగిలించారని, అందులో లంచ్ బాక్స్ తో పాటు తన చేతి గడియారం ఉందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఉద్యోగం చేసుకునే తనకు ఆ రెండూ (లంచ్ బాక్స్, చేతి గడియారం) చాలా ముఖ్యమైనవని ఫిర్యాదుదారు తరపు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసులో నిందితులిద్దరికీ నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు.

  • Loading...

More Telugu News