: ఇంటర్నెట్ సర్వీసు అందించడం కాదు...డౌన్ లోడ్ స్పీడ్ చెప్పాల్సిందే


ఇంటర్నెట్ సర్వీసులపై వినియోగదారులకు పూర్తి సమాచారం అందించాలని టెలికం కంపెనీలను ట్రాయ్ ఆదేశించింది. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ ఇంటర్నెట్ సేవల పేరిట టెలికం కంపెనీలు వినియోగదారుల జేబులకు చిల్లుపెడుతున్నాయి. ఇకపై అలాంటి ఆలోచనకు ట్రాయ్ ఆదేశాలు స్వస్తి చెబుతాయి. ట్రాయ్ ఆదేశానుసారం ఇకపై వైర్ లెస్ డేటా సర్వీసు డౌన్ లోడ్ స్పీడును తప్పక పేర్కొనాలి. అలా పేర్కొన్న ప్లానుకు అనుగుణంగా కనీసం 80 శాతం సర్వీసు అందజేయాలి. లేని పక్షంలో ట్రాయ్ తీసుకునే చర్యలకు సిద్ధంగా ఉండాలని పేర్కొంది. అయితే డౌన్ లోడ్ కనీస వేగం ఎంతుండాలనే మార్గదర్శకం ట్రాయ్ స్పష్టం చేయలేదు. ఈ నిబంధన వచ్చే నెల 23 నుంచి అమలులోకి రానుంది. ఈ ఏడాది మే నాటికి మొబైల్, డాంగ్లర్ ద్వారా ఇంటర్నెట్ వినియోగదారులు దేశవ్యాప్తంగా సుమారు 5 కోట్ల మంది వరకు ఉన్నట్టు సమాచారం. టెలికం కంపెనీలు మొబైల్, డాటా కార్డ్ ద్వారా 3జీ సేవల్లో కనీస డౌన్ లోడ్ స్పీడ్ 399 కిలో బైట్ల (కేబీపీఎస్) నుంచి 2.48 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలు అందజేస్తున్నాయని ట్రాయ్ కి తెలిపాయి. టెలికం కంపెనీలు చేసే ప్రకటనలపై ట్రాయ్ మండిపడింది. ఇష్టానుసారం ప్రకటనలు జారీ చేస్తూ, సేవలు కల్పించకపోతే శిక్ష ఎదుర్కొవలసి వస్తుందని ట్రాయ్ టెలికం కంపెనీలను హెచ్చరించింది. ట్రాయ్ ఆదేశాల మేరకు 3జి, సీడీఎమ్ఏ, ఈవీడీ సేవల్లో కనీస డౌన్ లోడ్ స్పీడ్ 1 ఎంబీపీఎస్ గాను, జీఎస్ఎమ్, సీడీఎంఏ-2జీ లకు 56 ఎంబీపీఎస్ గా, సీడీఎమ్ఏ హైస్పీడ్ డేటా సేవలను 512 ఎంబీపీఎస్ గా ఉండాలని నిబంధన విధించిన సంగతి తెలిసిందే. ట్రాయ్ తాజా హెచ్చరికల నేపథ్యంలో టెలికం కంపెనీలు ఇంటర్నెట్ డౌన్ లోడ్ వేగం తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News