: మధ్యాహ్న భోజనం తిని... ఆసుపత్రి పాలైన విద్యార్థులు
పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 56 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తిన్న విద్యార్థులు కడుపునొప్పితో విలవిల్లాడిపోయారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలోని కృష్ణపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రిలో విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.