: చర్లపల్లి జైలును సందర్శించిన తెలంగాణ హోంమంత్రి


తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి ఈరోజు (సోమవారం) చర్లపల్లి జైలును సందర్శించారు. ఈ సందర్భంగా జైలులో బియ్యం, దుప్పట్లు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ... జైళ్లలో వైద్యుల కొరత తీరుస్తామని, ఖైదీల భోజనంలో నాణ్యత పెంచుతామని తెలిపారు. జైళ్ల సంస్కరణలకు పెద్దపీట వేస్తామని చెప్పిన నాయిని అభివృద్ధికోసం దేశంలోని జైళ్లకు ప్రత్యేక టీమ్ లను పంపిస్తామని చెప్పారు. క్షమాభిక్షకు అర్హులైన ఖైదీల విడుదలకు కసరత్తు చేస్తున్నామని, దీనిపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని హోంమంత్రి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News