: మాసాయిపేట బాధిత కుటుంబాలకు సివిల్స్ అభ్యర్థిని సాయం
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద జరిగిన స్కూలు బస్సు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు సివిల్స్ అభ్యర్థిని తనదైన ఆర్థిక సాయం అందించింది. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన కాటం నాగలక్ష్మి స్వచ్ఛంధంగా ఈ ఘటనపై స్పందించింది. చిన్నారుల కుటుంబానికి వెయ్యి చొప్పున రూ.14వేల నగదును నిన్న (ఆదివారం) తూప్రాన్ తహసీల్దార్ స్వామికి అందజేసింది. హైదరాబాదులో ఉంటూ సివిల్స్ కు సిద్ధమవుతున్న తాను బస్సు ప్రమాదంపై పత్రికల్లో వస్తున్న కథనాలను చదివి చలించినట్లు నాగలక్ష్మి తెలిపింది. బస్సు దుర్ఘటన బాధాకరమని, ఎంతో కొంత సాయపడాలనే ఉద్దేశ్యంతోనే డబ్బు అందజేసినట్లు ఆమె చెప్పింది.