: తుంగభద్ర నదికి భారీగా వరద నీరు
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా పడుతుండడంతో కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నదిలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం తుంగభద్ర నదిలో ఇన్ ఫ్లో 64,850 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3,750 క్యూసెక్కులుగా ఉందని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. వరద నీరు ఎక్కువగా చేరడంతో తుంగభద్ర నది నీటిమట్టం ప్రస్తుత 1626 అడుగులకు చేరింది. మరో ఏడు అడుగుల నీరు వచ్చి చేరితే తుంగభద్ర నది పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుందని అధికారులు తెలిపారు.