: సాయిబాబా గుడిలో తుపాకీ కలకలం
అకస్మాత్తుగా కనిపించిన తుపాకీతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన గుంటూరు బ్రాడీపేటలోని సాయిబాబా మందిరంలో చోటుచేసుకుంది. గుడి ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తికి చెందిన తుపాకీని భక్తులు చూశారు. అనంతరం ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. గుడికి చేరుకున్న పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ తుపాకీని ఎవరైనా మర్చిపోయారా? లేక కావాలనే అక్కడ వదిలి వెళ్లారా? అనే విషయం తేలాల్సి ఉంది.