: బాబూ! కొంచెం ఎడంగా ఉండండి... భద్రతా సిబ్బందికి మోడీ సూచన!


ఓ దేశానికి ప్రధానమంత్రి అంటే భద్రత పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతికూల శక్తులు మిక్కిలిగా కాచుకుని ఉంటాయి, ఆ వ్యక్తి ప్రాణాల కోసం. ముఖ్యంగా నరేంద్ర మోడీకైతే ఆ ముప్పు కాస్త ఎక్కువగానే ఉంటుంది. బీజేపీపై మతతత్వ పార్టీ అన్న ముద్ర పడడమే అందుక్కారణం. ఇక అసలు విషయానికొస్తే.. తనకు భద్రత కల్పిస్తున్న ఎస్పీజీ బృందానికి మోడీ ఓ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. తనకు మరీ దగ్గరగా కాకుండా కాస్త ఎడం పాటించాలని వారితో చెప్పినట్టు సమాచారం. ఇదంతా కూడా తాను మాట్లాడే మాటలు వారి చెవిన పడకుండా ఉండేందుకేనట. గతంలో ఎస్పీీజీకి డిప్యూటేషన్ పై వచ్చిన ఓ ఐపీఎస్ అధికారి అప్పటి ప్రధాని మాటలను విని లీక్ చేయడంతో అతడిని పాత క్యాడర్ కు తిప్పిపంపారు. అలాంటి ఘటనల నేపథ్యంలోనే ప్రధాని మోడీ తాజా నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది.

  • Loading...

More Telugu News