: జగన్ పై దేవినేని ఉమ ఫైర్
రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. లోటు బడ్జెట్ ఉన్నా రుణమాఫీ హామీని నిలబెట్టుకున్నామన్నారు. ప్రజలకు మేలు చేస్తున్న తమ దిష్టిబొమ్మలను దగ్ధం చేయమని చెప్పడం సరికాదని ఆయన అన్నారు. చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేయమంటూ జగన్ పిలుపునివ్వడంపై దేవినేని ఉమ మండిపడ్డారు. అవినీతి కేసులు నమోదైన జగన్ కు చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు. కృష్ణాజలాల పంపిణీ విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపిస్తామని ఆయన చెప్పారు. నదీజలాల విషయంలో న్యాయపరంగా రావాల్సిన దానిపై పోరాటం చేస్తామని మంత్రి ఉమ అన్నారు.