: ఆ స్లిప్ ఫీల్డింగ్ ఏంటి..?: ధోనీపై గవాస్కర్ అసంతృప్తి
సౌతాంప్టన్ టెస్టు తొలి రోజు ఆటలో కెప్టెన్ ధోనీ ఫీల్డింగ్ అమరికపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్లిప్స్ లో సమర్థులైన ఫీల్డర్లను పెడితే బావుండేదని అభిప్రాయపడ్డారు. కోహ్లీ, విజయ్ లు స్లిప్ ఫీల్డింగ్ లో నిపుణులని, వారిని కాదని జడేజాకు స్లిప్స్ బాధ్యతలు అప్పగించడం సరికాదనీ అన్నారు. ఇలాంటి పొరబాట్లు పునరావృతమవుతూనే ఉన్నాయని సన్నీ ఎత్తిచూపారు. జడేజా పరుగులు ఆపడంలో దిట్ట అని, అతడిని అవుట్ ఫీల్డ్ లోనే ఉంచాలని సూచించాడు. జడేజా మంచి ఫీల్డరేనని, క్యాచ్ లు చక్కగా అందుకుంటాడని, అయితే, అతను అవుట్ ఫీల్డ్ లోనే జట్టుకు ఎక్కువగా ఉపయోగపడతాడని ఈ దిగ్గజ ఓపెనర్ వివరించారు. పైగా, స్లిప్స్ లో ఫీల్డర్లు దగ్గరదగ్గరగా నిలుచుని ఉండడాన్ని తాను కామెంటరీ బాక్స్ నుంచి వీక్షించానని తెలిపారు. ఇలా నిలబడితే క్యాచ్ లు పట్టే విషయంలో గందరగోళం చోటుచేసుకుంటుందని అన్నారు.