: ముస్లింలకు ఒబామా 'ఈద్' శుభాకాంక్షలు


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 'ఈద్-అల్-ఫితర్' (రంజాన్) పండుగను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. తన తరఫునే కాకుండా, అర్థాంగి మిచెల్లీ తరఫున కూడా ముస్లిం కుటుంబాలకు ఒబామా శుభాకాంక్షలు తెలిపారు. ఈ చివరిమాసం ఉపవాసానికి, దానగుణానికి, ఆధ్యాత్మికతకు, పేదలకు సేవ చేసేందుకు అవకాశమిస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతేగాకుండా, అమెరికా నిర్మాణంలో ముస్లిం అమెరికన్ల పాత్రను ఈద్ గుర్తు చేస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News