: వ్యవసాయ భూముల్లో రాజధాని ఏర్పాటుకు ఒప్పకోం: రఘువీరారెడ్డి


వ్యవసాయ భూముల్లో రాజధాని ఏర్పాటుకు ఎట్టిపరిస్థితుల్లోను ఒప్పుకోమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. రాజధాని పేరుతో తెలుగుదేశం నేతలు, ఆ పార్టీ కార్యకర్తలు దోపిడీకి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో చంద్రబాబు ప్రభుత్వం... ఇప్పటికే ఓ ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించుకుందని, ఆ ప్రాంతం చుట్టుప్రక్కల భూములను టీడీపీ నేతలు, సానుభూతిపరులు కొనుగోలు చేసి రిజిష్టర్ చేసుకున్నారని ఆయన ఆరోపించారు. రాజధాని అనుకున్న ప్రాంతం చుట్టూ ఉన్న భూములను టీడీపీ నేతలు కొనుగోలు చేయడం పూర్తయ్యాక... ఏమీ తెలియనట్టు ప్రస్తుతం అక్కడ రిజిష్ట్రేషన్లు నిలుపుదల చేస్తున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించడం విడ్డూరంగా, హాస్యాస్పదంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News