: బాలరాజు నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ


విశాఖ పట్నంలోని మాజీ మంత్రి బాలరాజు నివాసంలో ఇవాళ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ నెల 27వ తేదీన విశాఖలో జరగనున్న డీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది. డీసీసీ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ... ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో వైఎస్సార్సీపీ విఫలమైందని అన్నారు. రైతు రుణమాఫీని టీడీపీ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మంత్రివర్గంలో గిరిజనులకు సరైన ప్రాతినిధ్యం కల్పించకపోవడం బాధాకరమని బాలరాజు అన్నారు.

  • Loading...

More Telugu News