: షహరాన్ పూర్ అల్లర్లలో కుట్ర కోణం: బీజేపీ


ఉత్తరప్రదేశ్ లోని షహరాన్ పూర్ లో చోటుచేసుకున్న అల్లర్లలో కుట్ర కోణం దాగుందని, ఈ అల్లర్లకు అఖిలేష్ యాదవ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే, పక్కాగా రచించిన ప్రణాళికలో భాగంగానే షహరాన్ పూర్ అల్లర్లు చోటుచేసుకుంటున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కల్ రాజ్ మిశ్రా ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని ఆయన పార్టీలకు పిలుపునిచ్చారు. బలవంతంగా జరుగుతున్న భూ ఆక్రమణకు నిరసన తెలుపుతున్న వారిపై ఓ వర్గం దాడికి దిగిన తీరును చూస్తే, ఇందులో భారీ కుట్ర దాగుందన్న అనుమానం వ్యక్తమవుతోందని ఆయన అన్నారు. షహరాన్ పూర్ అల్లర్లు దురదృష్టకరమన్న మిశ్రా, ముందస్తు ప్రణాళిక ప్రకారం జరుగుతున్న ఈ అల్లర్లకు భూ తగాదాను రాష్ట్ర ప్రభుత్వం సాకుగా చూపిస్తోందన్నారు. అయితే తప్పు చేసిన వారిని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఆయన యూపీ సర్కారును డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News