: ఆగస్టులో కేంద్ర కేబినెట్ విస్తరణ... దత్తాత్రేయకు మంత్రి పదవి ఛాన్స్!
నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ఇటీవలే రెండు నెలలు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో వచ్చే నెలలో మంత్రి మండలిని మోడీ విస్తరించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆగస్టు 14తో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసిపోతాయి. ఆ తర్వాత విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు ఈసారి కేంద్రమంత్రి పదవి దక్కనుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం మోడీ మంత్రివర్గంలో 22 మంది క్యాబినెట్, 22 మంది సహాయమంత్రులు ఉన్నారు.