: సోనియా ఇఫ్తార్ విందులో 'పెద్ద తలలు' కనిపించలేదు


యూపీఏ అధినేత్రి హోదాలో సోనియా గాంధీ ఇచ్చిన ఇఫ్తార్ విందు వెలవెలబోయింది. అధికారంలో ఉన్నప్పుడు అంటకాగిన నేతలు ముఖం చాటేశారు. ఢిల్లీలోని అశోకా హోటల్లో ఆమె ఇచ్చిన విందుకు చాలా మంది రాజకీయ ప్రముఖులు డుమ్మా కొట్టారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆర్ఎల్డీ అధినేత అజిత్ సింగ్, ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్)లతో పాటు సమాజ్ వాదీ, బీఎస్పీ నేతలెవరూ ఈ విందులో కనిపించలేదు. ఆర్జేడీ, జేడీయూ నేతలు మాత్రం హాజరయ్యారు. మూడేళ్ళ తర్వాత సోనియా ఇఫ్తార్ విందు ఇవ్వడం ఇదే ప్రథమం. దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మూడేళ్ళ పాటు ఆమె ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించలేదు. కాగా, విందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానాకర్షణగా నిలిచారు. దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్, అంబికా సోనీ, గులాంనబీ ఆజాద్, జైరాం రమేశ్, రాజీవ్ శుక్లా వంటి వీరవిధేయులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరై సోనియా పరువు నిలిపారు.

  • Loading...

More Telugu News