: నేడు ఖరారు కానున్న ఎంసెట్ కౌన్సిలింగ్ తేదీలు
ఎంసెట్ కౌన్సిలింగ్ తేదీలు ఈ రోజు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. కాసేపట్లో ఏపీ, తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులతో ఉన్నత విద్యామండలి భేటీ కానుంది. ఇప్పటికే కౌన్సిలింగ్ కు ఏపీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం కౌన్సిలింగ్ ను కొద్దిరోజుల పాటు వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఆగస్టు 4న విచారణ జరగనుంది. అయితే, కౌన్సిలింగ్ నిర్వహణపై తమకు ఏమాత్రం అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు తెలిపిన సంగతి గమనార్హం. ఈ నేపథ్యంలో, టీఎస్ ప్రభుత్వ నిర్ణయం నేడు కీలకం కానుంది. ఎంసెట్ కౌన్సిలింగ్ సహా ఉమ్మడి సెట్ ల ప్రవేశాలపై నేడు ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకోనుంది.