: కేసీఆర్ పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు: ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు


ఆంధ్రప్రదేశ్ గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో కేసీఆర్ ఏమాత్రం అవగాహన లేకుండా పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ ప్రాంతంలో నాలుగేళ్లు నివాసమున్నా వాళ్లు స్థానికుల క్రిందకే వస్తారని... అయితే ఈ విషయంపై ఏమాత్రం ఆలోచన లేకుండా... కొన్నేళ్లుగా హైదరాబాద్ లో స్థిర నివాసముండి, చదువుకుంటున్న ఏపీ విద్యార్థులను స్థానికేతరులు అనడం కేసీఆర్ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆయన అన్నారు. స్థానికతకు సంబంధించి 371డి వర్తింపుపై న్యాయపోరాటం చేస్తామని ఆయన అన్నారు. ఒకవేళ కేసీఆర్ ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోతే... తామే హైదరాబాద్ లో చదువుకుంటున్న ఏపీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News