: పటిష్ఠ స్థితిలో ఇంగ్లండ్... 247/2


తొలి రెండు టెస్టుల్లో సత్తా చాటిన భారత బౌలర్లు సౌతాంప్టన్ లో జరుగుతున్న మూడో టెస్టులో చెమటోడ్చుతున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ రెండు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసి భారీ స్కోరు దిశగా కొనసాగుతోంది. వరుసగా బ్యాటింగ్ వైఫల్యాలతో సతమతమవుతున్న ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ ఈ మ్యాచ్ తో సత్తా చాటాడు. 95 పరుగులు చేసి షమీ బౌలింగ్ లో ఔటయ్యాడు. 55 పరుగుల వద్ద ఓపెనర్ రాబ్సన్ (26) ఔటైనప్పటికీ ఇంగ్లిష్ బ్యాట్స్ మెన్ తడబడకుండా స్కోరు పెంచారు. అనంతరం బల్లాన్స్ (104 నాటౌట్), బెల్ (16 నాటౌట్) సమయోచితంగా ఆడి మరో వికెట్ పడకుండా అడ్డుకున్నారు. భారత బౌలర్లలో జడేజా, షమీలకు చెరో వికెట్ దక్కింది.

  • Loading...

More Telugu News