: సోనియా ఇఫ్తార్ విందు... హాజరైన శరద్ యాదవ్
ముస్లిం ప్రముఖులకు యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పలువురు ముస్లిం మతపెద్దలు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జేడీ యూ అధినేత శరద్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. కాగా, ఈ కార్యక్రమానికి శరద్ యాదవ్ హాజరుకావడం... బీహార్లో మారుతున్న రాజకీయ సమీకరణాలకు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.