: అవినీతి న్యాయమూర్తి అంశంపై మన్మోహన్ సింగ్ ప్రకటన కోరుతున్న కేంద్రం


అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్రాస్ హైకోర్టు అదనపు జడ్జి పదవీకాలం పొడిగించేందుకు యూపీఏ హయాంలో ప్రయత్నించారంటూ వచ్చిన ఆరోపణలపై స్పందించాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై ఒత్తిడి మొదలైంది. దానిపై నిర్దిష్టమైన ప్రకటన చేయాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఈ విషయాన్నంతటినీ ముందుగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి మార్కండేయ కట్జూ వెల్లడించారన్నారు. యూపీఏ హయాంలో ప్రభుత్వం ఎలా పనిచేసిందో ఈ విషయం ద్వారా తెలుస్తుందని, ప్రతి అంశంలోనూ రాజీకోసం ప్రయత్నిస్తున్నట్లు ఉందని ఆరోపించారు. కాగా, మన్మోహన్ దీనిపై మౌనంగా ఉండటంవల్ల ఏదో దాస్తున్నట్లే అనిపిస్తోందని చెప్పారు. కాబట్టి, మాజీ పీఎం తక్షణమే సదరు అంశంలో అప్పట్లో ఏం జరిగిందో స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. దానివల్ల న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ పెరిగేందుకు సహాయపడుతుందని పేర్కొన్నారు. అంతేకాక, ఏవైనా అపోహలున్నా తొలగిపోతాయని వెంకయ్య అన్నారు.

  • Loading...

More Telugu News