: సానియాపై వ్యాఖ్యలకు ఇక ముగింపు పలకండి: మంచు లక్ష్మి
సానియా మీర్జా స్థానికత వ్యవహారంపై నటి, నిర్మాత మంచు లక్ష్మి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఆమెపై వ్యాఖ్యలకు ఇక ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. మన క్రీడాకారులను మనం కించపర్చుకోరాదని సూచించారు. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసడర్ గా సానియా తన పాత్రకు న్యాయం చేయగలదని నమ్మకం వ్యక్తం చేశారు. టెన్నిస్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించడం ద్వారా సానియా తన జీవితాన్ని ఆటకు అంకితం చేశారని లక్ష్మి చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంలో సానియాకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.