: త్వరలోనే బాబు గుట్టు బయటపెడతా: కర్నె ప్రభాకర్


త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుట్టు బయటపెడతానంటున్నారు టీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్. హైటెక్ సిటీ ఎదుట బాబు పది ఎకరాలను ఆక్రమించారని ప్రభాకర్ ఆరోపించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని చెప్పారు. బాబు బాధితులను అందరి ముందుకు తీసుకువస్తానని తెలిపారు. ఇక, టీడీపీ నేత రేవంత్ రెడ్డిపైనా కర్నె నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి... చంద్రబాబు ఏజెంటులా, ఆంధ్రా బానిసలా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. కేసీఆర్ పై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులపై తుపాకీ గురిపెట్టిన రేవంత్ ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్నాడని కర్నె విమర్శించారు.

  • Loading...

More Telugu News