: కెప్టెన్ ధోనీకి ఐసీసీ సీరియస్ వార్నింగ్
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. జడేజా వ్యవహారంలో తుది తీర్పు వచ్చిన తర్వాతే స్పందిస్తే మంచిదని ధోనీని హెచ్చరించింది. విచారణ కమిటీపై ధోనీ అర్థంలేని వ్యాఖ్యలు కట్టిపెట్టాలని కటువుగా వ్యాఖ్యానించింది. విచారణ నిబంధనలకు లోబడే సాగుతోందని పేర్కొన్న ఐసీసీ... ప్రాథమిక విచారణ అనంతరం జడేజాకు జరిమానా విధించడం సరైన నిర్ణయమేనని సమర్థించుకుంది. ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ పేసర్ ఆండర్సన్, భారత ఆల్ రౌండర్ జడేజా మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ ఘటనలో జడేజాను దోషిగా పేర్కొనడంపై కెప్టెన్ ధోనీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంపై విచారణలో చాలా విషయాలను పట్టించుకోకుండా వదిలేశారని ధోనీ ఆరోపించాడు. జరిమానా నిర్ణయం వ్యక్తిగతంగా తననెంతో బాధించిందని పేర్కొన్నాడు.