: గూగుల్ పై సీబీఐ ప్రాథమిక విచారణ
అనుమతి లేని ప్రదేశాలను గూగుల్ తన మ్యాపుల్లో పొందుపరిచిందన్న ఆరోపణలపై సీబీఐ ఈ సెర్చ్ ఇంజిన్ దిగ్గజంపై ప్రాథమిక విచారణ నమోదు చేసింది. 2013లో గూగుల్ 'మ్యాపథాన్' పేరిట ప్రదేశాలను మ్యాపింగ్ చేయాలంటూ ప్రజలకు పోటీ నిర్వహించింది. ఆసుపత్రులు, రెస్టారెంట్లను మ్యాపింగ్ చేయాల్సిందిగా సూచించింది. అయితే, ఆ మ్యాపుల్లో రక్షణ రంగానికి చెందిన ప్రదేశాలు కూడా చోటు చేసుకున్నాయి. అదే ఇప్పుడు గూగుల్ ను కష్టాల్లోకి నెట్టింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సర్వే ఆఫ్ ఇండియా గూగుల్ ను కోరింది. ఈ పోటీలు ప్రారంభించేందుకు తమ అనుమతి తీసుకోలేదని తెలిపింది. అంతేగాకుండా నిబంధనల ఉల్లంఘనల విషయాన్ని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది సర్వే ఆఫ్ ఇండియా. హోం శాఖ ఆదేశాలతో సీబీఐ గూగుల్ పై ప్రాథమిక విచారణ నమోదు చేసింది.