: మేమైతే చానళ్ళను నిలిపివేయం: ఏపీ ఎంఎస్వో
విజయవాడలో నేడు ఏపీ ఎంఎస్వో సంఘం నేతలను ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ సన్మానించింది. ఏపీ ఎంఎస్వో సంఘం అధ్యక్షుడు సాయిబాబు, కార్యదర్శి రమేశ్ లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. అనంతరం సాయిబాబు మాట్లాడుతూ, ఏమైనా సమస్యలుంటే చానళ్ళ యాజమాన్యాలతో చర్చించి పరిష్కరించుకుంటామని, అంతేగాని, తామైతే చానళ్ళు నిలిపివేయమని తెలంగాణ ఎంఎస్వోలకు చురక అంటించారు. ఆంధ్రలో చానళ్ళను నిలిపివేసే పరిస్థితి ఎప్పటికీ రాదని ఉద్ఘాటించారు.