: చంద్రబాబు బీద అరుపులు రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు: రఘువీరా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి విరుచుకుపడ్డారు. బాబు బీద అరుపులు రాష్ట్రానికి శ్రేయస్కరం కాదని విమర్శించారు. ఉద్యోగుల వయోపరిమితి పెంచడం మినహా ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదని మండిపడ్డారు. ఈ క్రమంలో టీడీపీ పాలనపై ఆగస్టు 4 నుంచి ప్రత్యక్ష పోరాటానికి దిగుతున్నామని రఘువీరా తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టరేట్లను ఈ సందర్భంగా ముట్టడిస్తామని చెప్పారు.