: మత్స్యకారులకు హెచ్చరిక
బంగాళాఖాతంలో వేటకు వెళ్ళే మత్స్యకారులకు అధికారులు హెచ్చరిక జారీ చేశారు. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, తద్వారా దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి 45-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ విభాగం పేర్కొంది. ఈ నేపథ్యంలో వేటకు వెళ్ళే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా, ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది.